
న్యూస్‌టుడే, పెద్దాపురం అర గ్రాము బరువైన సూక్ష్మ వినాయకుడి విగ్రహాన్ని లాగుతున్న చీమ వినాయక చవితిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గ్రహీత డాక్టర్‌ తాళాబత్తుల సాయి ఆదివారం అద్భుత కళాఖండాన్ని రూపొందించారు. అర గ్రాము బరువు ఉన్న వినాయకుడి సూక్ష్మ కళారూపాన్ని తయారు చేశారు. దీనికి చెక్క, బంగారం, స్టీల్‌ బేరింగ్‌లు ఉపయోగించి రోజుకు గంట చొప్పున 8 రోజుల్లో తయారు చేశానన్నారు. వాహనం పొడవు ఒక సెంటీమీటర్, వినాయకుడి విగ్రహం ఎత్తు ఒక సెంటీమీటర్‌ అన్నారు. బుల్లి వాహనంపై వినాయకుడిని చీమ కాళ్లకు దారం కట్టి ఊరేగించినట్లు పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




