
చదువు పూర్తయిన తర్వాత చాలామందికి ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనే ఆకాంక్ష ఉంటుంది. ప్రభుత్వ రంగంలో భాగస్వామ్యం కావాలనుకునేవారికి ఇండియా పోస్ట్ ఫ్రాంచైజ్ ఒక మంచి అవకాశంగా చెప్పుకొవచ్చు. కొన్ని ప్రదేశాలలో పోస్టల్ సేవలను అందించడానికి ఫ్రాంచైజ్ అవుట్లెట్ మోడల్‌ను ఇండియా పోస్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫ్రాంచైజ్ ద్వారా మీరు కొన్ని పోస్టల్ సేవలను కస్టమర్లకు అందించవచ్చు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. ఫ్రాంచైజ్ అవుట్లెట్ మరియు పోస్టల్ ఏజెంట్. పోస్టల్ ఏజెంట్లు ఎక్కువగా స్టాంపులు, స్టేషనరీ వస్తువులను విక్రయిస్తారు. ఇక ఫ్రాంచైజ్ అవుట్లెట్ విషయానికొస్తే.. ఇండియా పోస్ట్‌తో ఒక ఒప్పందం చేసుకుని ఆథరైజ్డ్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ తెరవొచ్చు. దీని వల్ల మీరు ఆదాయం సంపాదించుకోవచ్చు. వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మీరు డెలివరీ చేసే ప్రతీ పోస్ట్‌పై కమిషన్ అందుతుంది.





