
బెంగళూరు(చిత్రదుర్గం): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం హవేరి జిల్లా బ్యాడగి తాలూకా గుండెనహళ్లి గ్రామం వద్ద జరిగింది. హవేరి జిల్లా గుండెనహళ్లి వద్ద బెంగళూరు -పుణె 48వ జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని బైక్‌ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తండ్రీకొడుకు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు బెల్గాం జిల్లా హుక్కేరి తాలూకా చిక్కలదిన్నె గ్రామానికి చెందిన మారుతి(41), పరశురామ్‌(15)గా గుర్తించారు. కాగా తీవ్రంగా గాయపడిన మారుతి భార్య మంజుల, మరో కుమారుడు జంజుండను బ్యాడిగి తాలూకా ఆసుపత్రికి తరలించారు. మారుతి తన భార్య, కుమారులతో కలిసి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్యాడగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే పట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




