
కైరో: ఇరాన్‌ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు ఆదివారం సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించారు. షారురాహ్‌ ప్రావిన్స్‌లోని సైనిక స్థావరం లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడినట్లు హూతీల సైనిక ప్రతినిధి వెల్లడించారు. అయితే, నష్టం వివరాలు తెలియరాలేదు. సౌదీకి పాకిస్థాన్‌ సంఘీభావం: హూతీల దాడులకు గురవుతున్న సౌదీ అరేబియాకు పాకిస్థాన్‌ సంఘీభావం ప్రకటించింది. సౌదీపై దాడులు ప్రాంతీయ భద్రత, ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. ఇదే విషయమై సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆదివారం ఫోన్‌లో మాట్లాడినట్లు ఇస్లామాబాద్‌ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్‌ దాడిలో దెబ్బతిన్న 1200 కి.మీ. పొడవైన చమురు పైప్‌లైన్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించిన నేపథ్యంలో హూతీల చర్యలను పాక్‌ ఖండించింది. గాజాలో కారుపై ఇజ్రాయెల్‌ దాడి: గాజా నగరంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. హమాస్‌ తీవ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





