
ఈనాడు, రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాలకు మరికొన్ని నెలలే సమయం ఉండటంతో ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయితే, రాజమహేంద్రవరంలోని గోదావరి నదిపై ఉన్న రైలు కమ్‌ రోడ్డు వంతెన నిర్వహణ పనులు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. వంతెనకు ఇరువైపులా ఉండాల్సిన రక్షణ గోడలు శిథిలమయ్యాయి. వారధి జాయింట్ల వద్ద ఉన్న ఇనుప ప్లేట్లు కొన్ని పూర్తిగా విరిగిపోగా మరికొన్ని కదిలిపోయి ప్రమాదకరంగా మారాయి. ఎక్కడ చూసిన చెత్త, పిచ్చిమొక్కలు కనిపిస్తున్నాయి. మరమ్మతుల పేరిట విద్యుత్తు తీగలు, ఇతర పైపులు, సామగ్రిని వంతెన నడకదారిలోనే నిర్లక్ష్యంగా పడేశారు. పుష్కరాల సమయంలో భక్తుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో పనుల్లో వేగం పెంచి అప్పటిలోగా పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.