
క్యాబ్‌లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుల నుంచి ముందే వసూలు చేసే ‘అడ్వాన్స్ టిప్పింగ్’ ఫీచర్‌ను తక్షణమే నిలిపివేయాలని క్యాబ్, బైక్-టాక్సీ అగ్రిగేటర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరహా విధానాలు వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతో పాటు అనైతిక వ్యాపార పద్ధతుల కిందకు వస్తాయని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే స్పష్టం చేశారు.
ముందస్తు టిప్‌లపై నేషనల్ కన్ జ్యూమర్ హెల్ప్‌లైన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. టిప్ ఇస్తేనే రైడ్ దొరుకుతుందనేలా ప్రయాణికులను ఒత్తిడికి గురిచేయడం నిబంధనలకు విరుద్ధం. టిప్ ఇవ్వడం అనేది పూర్తిగా వినియోగదారుడి ఇష్టం, ప్రయాణం ముగిసిన తర్వాత నచ్చితేనే ఇచ్చే అంశమని సీసీపీఏ చీఫ్ నిధి ఖరే తెలిపారు.





