
టీటీడీకి చెందిన విద్యా, వైద్య, ఆధ్యాత్మిక సంస్థల్లో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వస్తున్న వారితో... తిరుపతి సేవా కేంద్రంగా (సర్వీస్ హబ్) మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమల పద్మావతి అతిథి భవనంలో బుధవారం టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగంతో ఆయన సమీక్ష నిర్వహించారు.





