
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం నిర్వహించనున్న CBT-2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. CBT-1లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ సంబంధిత ప్రాంతీయ RRB అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. RRB NTPC UG CBT-2 పరీక్షను 2026 సెప్టెంబర్ 17న నిర్వహించనున్నారు. RRB నిబంధనల ప్రకారం, అభ్యర్థులు తమ ఈ-కాల్ లెటర్‌ను సంబంధిత RRB వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్ష కేంద్రం, తేదీ, షిఫ్ట్ వంటి వివరాలు ఈ-కాల్ లెటర్‌లోనే ఉంటాయి.