
యూపీఐ ఛార్జీల అంశంలో వచ్చిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఇది స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి వెలుపలి ఒత్తిడి లేదని పేర్కొంది. ‘‘యూపీఐ ఛార్జీలపై నిర్ణయం విదేశీ ప్రభావం వల్ల జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. ఇది అవాస్తవం. స్వయం సమృద్ధితో.. అందుబాటు ధరలలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్మించాలనే స్పష్టమైన లక్ష్యంతో యూపీఐ విధాన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటాం’’ అని వివరించింది.
N





