
కొణిజర్ల: కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన హరిప్రసాద్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. భార్య సునీతతో హరిప్రసాద్‌కు వారం రోజులుగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన హరి ప్రసాద్.. వెంకటాయపాలెం సమీపంలో సాగర్ కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సునీత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతి చెందడం, భర్త కాలువలో దూకడంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




