
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన టీ వ్యాపారి కరీం దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న అక్కసుతో, సొంత భార్యే ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా మట్టుబెట్టించినట్లు విచారణలో తేలింది. నిందితులు సలీమా బేగం, ఆమె ప్రియుడు గౌస్ పాషాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో నివాసముంటున్న కరీం, సలీమా బేగం దంపతులు టీ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అంతా సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో రెండేళ్ల క్రితం వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. సలీమా బేగంకు వరుసకు సోదరుడైన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన గౌస్ పాషాతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.





