
కోరుకొండ, న్యూస్‌టుడే: చెరువులో కలువ పూలు కోద్దామని వెళ్లిన ఇద్దరు స్నేహితులు అందులో మునిగి చనిపోయారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుకొండ మండలం పశ్చిమగోనగూడేనికి చెందిన సోడదాసి వీరబాబు(35), గోనుపాటి శివ(37) స్నేహితులు. ఇద్దరూ కలిసే తిరుగుతుంటారు. వినాయక చవితి నేపథ్యంలో కలువ పూలు కోసి అమ్మితే డబ్బులు వస్తాయని భావించారు. ఆదివారం కొత్త చెరువులోకి దిగారు. లోతు ఎక్కువ ఉండటంతో మునిగిపోయి ఇద్దరూ మృత్యువాత పడ్డారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగించే వీరబాబు.. భార్యతో విభేదాల కారణంగా వేరుగా ఉంటున్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులు ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. శివ కూడా కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





