
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. బాంబే హైకోర్టు ఆదేశాలతో దిశా సాలియన్ మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఎఫ్ఐఆర్ (FIR)లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే , ఆయన కుమారుడు ఆదిత్యా ఠాక్రేతో పాటు పోలీసు అధికారులు, బాలీవుడ్ నటులు దినో మోరియా , సూరజ్ పంచోలి, రియా చక్రవర్తి పేర్లను చేర్చడం సంచలనంగా మారింది.. సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఉద్దవ్,ఆదిత్యా ఠాక్రేపై FIR నమోదు చేయడం సంచలనం రేపింది. రేప్ అండ్ మర్డర్ కేసు కింద FIR నమోదు చేశారు.



