
మీగడ ఎక్కువగా రావాలంటే తప్పనిసరిగా చిక్కటి పాలు వాడాలి. డెయిరీ నుంచి తెచ్చే గేదె పాలు మీగడ కట్టడానికి చాలా ఉత్తమం. ఒకవేళ ప్యాకెట్ పాలు వాడేవారైతే తప్పనిసరిగా 'ఫుల్ క్రీమ్ మిల్క్' (గోల్డ్ ప్యాకెట్) ఎంచుకోవాలి. దీనివల్ల మీగడ సమృద్ధిగా రావడమే కాకుండా, మీగడ తీసిన తర్వాత మిగిలిన పాలు టోన్డ్ మిల్క్లా మారి తాగడానికి తేలికగా ఉంటాయి. గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.



