
ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ‘ఓం శాంతి శాంతిః’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు తరుణ్‌ భాస్కర్‌, (Tharun Bhascker) ఈషా రెబ్బ (eesha rebba). అప్పటి నుంచి ఈ జోడీ గురించి పలు వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఇద్దరిలో ఎవరూ వీటిపై స్పందించలేదు. కానీ, వినాయక చవితి సందర్భంగా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ పంచుకున్న ఓ ఫొటో ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. కేవలం అమాయకత్వాన్ని ప్రతిబింబించే ఎమోజీని జత చేస్తూ తరుణ్‌ భాస్కర్‌ ఈ ఫొటోను పంచుకున్నారు. దీనికి నటి మంచు లక్ష్మి స్పందిస్తూ ‘ఈ ఫొటో చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది’ అని కామెంట్‌ పెట్టగా, కావ్యా కల్యాణ్‌రామ్‌ అయితే, మరో అడుగు ముందుకేసి.. ‘పండగరోజు మంచి పులిహోర తిన్న ఫీల్‌ ఉంది ఈ ఫొటోలో’ అని కామెంట్ చేశారు. మరోవైపు వినాయకచవితి సందర్భంగా తరుణ్‌ భాస్కర్‌ స్వయంగా గణేశ్‌ బొమ్మను తయారు చేయడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ‘మహాశక్తి’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’ (Ramayana).


