
సంగారెడ్డి టౌన్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వినాయకుడికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి ప్రతిమలను ప్రతిష్టించి పూజలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి, చింతా సాయినాథ్, కొండల్ రెడ్డి, విఠల్, జీవీ శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


