
Asian Champions Trophy : అంతర్జాతీయ క్రికెట్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న భారత్, పాకిస్థాన్.. హాకీ విషయంలోలో మాత్రం కాస్త పట్టు సడలిస్తున్నాయి. త్వరలో జరుగనున్న ఆసియాన్ ఛాంపియన్స్ ట్రోఫీ (Asian Champions Trophy) కోసం పాక్ పురుషుల బృందం ఇండియాకు రానుంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో పాక్ హాకీ జట్టు ఆడనుందనే విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bagwant Mann) సోమవారం అధికారికంగా వెల్లడించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు గగనమైన వేళ అంతర్జాతీయ వేదికల్లో మాత్రమే తలపడుతున్నాయి దాయాదులు. ఇటీవలే..ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌లో ఎదురుపడిన భారత్, పాక్ జట్లు ఈసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. ఇండియా ఆతిథ్యమిస్తున్ను ఈ టోర్నీలో పాక్ ఆడనుంది. పంజాబ్‌లో జరుగున్న ఈ మెగా ఈవెంట్ కోసం అక్టోబర్‌లో పాక్ పురుషుల హాకీ బృందం భారత్‌కు రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. VIDEO | Chandigarh: Pakistan will be among the six countries that would compete in next month’s Men’s Asian Champions Trophy hockey tournament here, Punjab chief minister Bhagwant Mann said on Monday, citing the union government’s policy which allows the arch-foes to play on… pic.twitter.com/1R492gT3Og — Press Trust of India (@PTI_News) September 14, 2026 ‘ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ బహుళ దేశాలు పాల్గొనే టోర్నీ కాబట్టి ఏ సమస్యా ఉండదు. అయితే.. అందరూ అనుకుంటున్నట్టు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండదు’ అని ఆయన పేర్కొన్నారు. హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్, పాక్ హాకీ సమాఖ్య మధ్య సంబంధాలు మంచిగానే ఉన్నాయని తెలిపాడు. ‘భారత్, పాక్ హాకీ సమాఖ్యల మధ్య సత్సంబంధాలే ఉన్నాయని నేను ఓపెన్‌గా చెబుతున్నా. దాయాదిపై టీమిండియా గెలిచినప్పుడు.. నేను పాక్ ఆటగాళ్లను కూడా కలుస్తా. వారు నాపట్ల ఎంతో గౌరవం కనబరుస్తారు’ అని భోలానాథ్ సింగ్ చెప్పారు. అక్టోబర్ 27 నుంచి జలంధర్‌లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవ్వనుంది. ఈ టోర్నీలో భారత్, చైనా, జపాన్, మలేషియా, దక్షిణ కొరియా, పాకిస్థాన్‌లు పాల్గొననున్నాయి. నవంబర్ 5వ తేదీన మొహాలీలో ఫైనల్ ఉంటుంది.





