
జైషే మహమ్మద్‌ (జేఈఎం) ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌పై రివార్డును పాకిస్థాన్‌.. రూ.17 లక్షల నుంచి రూ.24 లక్షలకు పెంచింది. ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌’ (ఎఫ్‌ఏటీఎఫ్‌) సమావేశం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అజర్‌ అఫ్గానిస్థాన్‌కు పారిపోయాడని పాక్‌ చెబుతోంది. భారత్‌లో 2001 నాటి పార్లమెంటుపై దాడి, 2008 ముంబయి దాడులు, 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి, 2019 నాటి పుల్వామా బాంబుదాడి వంటి ప్రధాన ఉగ్రఘటనల్లో అజర్‌ హస్తం ఉంది.





