
ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ ( Pakistan ) నుంచి అక్రమంగా ఎండు ఖర్జూరాలు (Dry Dates) భారత్‌కు తరలిస్తున్న ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. పాక్‌ నుంచి దిగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ.. ఆ దేశానికి చెందిన 362 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు ఖర్జూరాలను నాసిక్‌కు చేర్చినట్లు నిఘా వర్గాలు డీఆర్ఐ అధికారులకు సమాచారం ఇచ్చాయి. దీంతో నాసిక్‌లోని అంబాడ్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ వద్ద ముంబయికి చెందిన ఓ సంస్థ దిగుమతి చేసుకున్న 13 కంటైనర్ల ఎండు ఖర్జూరాలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని యూఏఈ నుంచి దిగుమతి చేసుకున్నట్లు సదరు సంస్థ పేర్కొంది. అయితే ఈ ఖర్జూరాలు పాక్‌ నుంచి తీసుకువచ్చినట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఎండు ఖర్జూరాలను తొలుత కరాచీ పోర్టు నుంచి... యూఏఈలోని జెబెల్ అలీ పోర్టుకు తరలించారని అధికారులు పేర్కొన్నారు. అనంతరం వాటిని మరో నౌకలోకి లోడ్‌ చేసి నకిలీ పత్రాలు సృష్టించి, భారత్‌కు తరలించినట్లు తెలిపారు. సదరు కంపెనీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పహల్గాంలో గతేడాది జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ( Pakistan ) నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకపై ఇరుదేశాల మధ్య ఎటువంటి వాణిజ్య సంబంధాలు ఉండబోవని స్పష్టం చేసింది. నాటి నుంచి పాకిస్థాన్‌ నుంచి దిగుమతి అయ్యే అన్ని మార్గాల్లో ‘ఆపరేషన్ డీప్ మ్యానిఫెస్ట్’ పేరిట డీఆర్ఐ తనిఖీలు నిర్వహిస్తోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) ఘనంగా జరిగింది.




