
అమరావతి: దిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సును భారత్‌ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని సీఎం చంద్రబాబు ( Chandrababu ) అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్న సమయంలో ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం వంటి అంశాలపై దిల్లీ డిక్లరేషన్ దృష్టి పెట్టడం కీలక పరిణామం. భిన్న అభిప్రాయాలు కలిగిన దేశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి.. నిర్మాణాత్మక చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించే విశ్వసనీయ వేదికగా భారత్ ఎదిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తూనే ఏకాభిప్రాయాన్ని సాధించగల సామర్థ్యం ప్రపంచ వేదికపై భారత్ ఆర్థిక బలం, ప్రాధాన్యాన్ని మరింత పెంచుతోంది. ఈ చరిత్రాత్మక సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సోమవారం పండగ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేశారు. భిన్న రూపాల్లో తీర్చిదిద్దిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ ఫొటోలు మీ కోసం..




