
ఉంగరాల జుట్టు సాధారణంగానే పొడిగా ఉంటుంది.. దాంతో నిర్జీవంగా కనిపిస్తుంది.. మెయింటెయిన్ చేయడం కూడా కొందరికి కష్టంగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే కర్లీ హెయిర్నూ అందంగా కనిపించేలా చేయచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..! ఉంగరాల జుట్టు సాధారణంగానే పొడిగా ఉంటుంది.. దాంతో నిర్జీవంగా కనిపిస్తుంది.. మెయింటెయిన్‌ చేయడం కూడా కొందరికి కష్టంగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని సింపుల్‌ చిట్కాలు పాటిస్తే కర్లీ హెయిర్‌నూ అందంగా కనిపించేలా చేయచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..! ⚛ కొంతమందికి రోజూ తలస్నానం చేయడం అలవాటు. కర్లీ హెయిర్‌ ఉన్న వారూ కొందరు ఇలాగే చేస్తుంటారు. దీనివల్ల జుట్టు మరింత పొడిబారుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి, జుట్టు తత్వాన్ని బట్టి వారానికి రెండు నుంచి మూడుసార్లు మాత్రమే తలస్నానం చేయాలంటున్నారు. అది కూడా గాఢత తక్కువగా ఉండే షాంపూని నీళ్లలో కలుపుకొని చేయడం మంచిదని చెబుతున్నారు. ⚛ తలస్నానం తర్వాత నాణ్యమైన కండిషనర్‌ను రాయడం మర్చిపోకూడదు. ఇది కేశాలు పొడిబారిపోకుండా చేస్తుంది. అలాగే తలస్నానానికి వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చటి లేదంటే చల్లటి నీళ్లు ఉపయోగించడం మంచిదట. ⚛ కర్లీ హెయిర్‌ సంరక్షణ కోసం వారానికి మూడుసార్లు నూనె పెట్టుకోమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొబ్బరి నూనెను కుదుళ్లు, వెంట్రుకలకు అప్లై చేసి కాసేపు మర్దన చేయాలి. ఇలా రాత్రుళ్లు నూనె పెట్టుకొని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తే జిడ్డుగా కూడా అనిపించదని చెబుతున్నారు. ⚛ తడిగా ఉన్న జుట్టును దువ్వడం, టవల్‌తో గట్టిగా రుద్దుతూ తుడవడం.. వంటివి అస్సలు చేయకూడదట. ఎందుకంటే ఇవి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట. మెత్తటి కాటన్‌ క్లాత్‌తో జుట్టును పొడిగా తుడుచుకొని.. ఆరిన తర్వాత చెక్క దువ్వెనతో చిక్కు తీసుకోవడం మంచిదట. ⚛ తడిగా ఉన్న కర్లీ హెయిర్‌ను బిగుతుగా జడ వేసుకోవడం లేదంటే ముడేయడం.. వంటివి చేస్తే జుట్టు చివర్లు చిట్లిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి జుట్టును ముడేసే ముందు సహజసిద్ధంగా ఆరనివ్వడం ఉత్తమం. ⚛ షియా బటర్‌, నువ్వుల నూనె.. వంటివి కర్లీ హెయిర్‌ సంరక్షణకు చక్కగా ఉపయోగపడతాయట. ⚛ ఉంగరాల జుట్టు పొడిబారకుండా ఇంట్లోనే తయారుచేసుకునే హెయిర్ స్ప్రే కూడా చక్కగా పనిచేస్తుందట. ఈ క్రమంలో ఒక స్ప్రే బాటిల్‌లో డిస్టిల్డ్‌ వాటర్‌ నింపి అందులో కొన్ని చుక్కల చొప్పున వెజిటబుల్‌ ఆయిల్‌, రోజ్‌మేరీ ఆయిల్‌, లావెండర్‌ నూనె వేసి.. ఇవన్నీ చక్కగా కలిసిపోయేలా సీసాను బాగా కదపాలి. దీన్ని జుట్టుపై అప్పుడప్పుడూ స్ప్రే చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics .





