
చండీగఢ్‌: ద్విచక్ర వాహనాలపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు పంజాబీ గాయకుడు గులాబ్‌ సిద్ధు ఇంటిపై కాల్పులు జరిపారు. బర్నాలా జిల్లాలోగల ఫర్వాహీ గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు 6 సార్లు ఇంటిపై కాల్పులు జరపగా.. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సిద్ధు ఆస్ట్రేలియాలో ఉండగా.. ఆయన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. కాల్పుల అనంతరం.. ఈ ఘటనకు తానే బాధ్యుడనని గ్యాంగ్‌స్టర్‌ దోనీ బాల్‌ చెప్పినట్లుగా ఉన్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.