
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఒకటి రెండు సార్లు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.




