
జీవితం ఎప్పుడు మలుపు తీసుకుంటుందో ఊహించడం అసాధ్యం. కొన్నిసార్లు, కష్టాలు మనల్ని పరీక్షించినప్పటికీ, అవే కష్టాలు భవిష్యత్తులో విజయానికి సోపానాలుగా మారతాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్న తమిళ నటుడు సూరి జీవితం దీనికి మంచి ఉదాహరణ. ఒకప్పుడు గోడలకు రంగులు వేస్తూ రోజుకు కేవలం 20 రూపాయలు సంపాదించే నటుడు, ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతడు మరెవరో కాదు సూరి. తమిళ సినీ నటుడు సూరి మధురైకి చెందినవారు. ఆరుగురు తోబుట్టువులతో కూడిన ఒక సాధారణ కుటుంబంలో పెరిగిన ఈ నటుడికి చిన్నప్పటి నుంచే సినిమాల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. ముఖ్యంగా సూరి సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకు పెద్ద అభిమాని. సింగిల్-స్క్రీన్ థియేటర్లలో రజనీకాంత్ చిత్రాలను చూస్తూ, చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ పెరిగిన సూరి, ఒకరోజు అదే సూపర్‌స్టార్‌తో తెరను పంచుకుంటానని బహుశా ఎప్పుడూ ఊహించి ఉండడు. కానీ జీవితం ఆ తర్వాత అతనికి అలాంటి అవకాశాన్నే అందించింది.






