
పోలవరం, సెప్టెంబర్16 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి సంజీవ్ వోహ్రా నేతృత్వంలోని బృందం బుధవారం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించింది. షెడ్యూల్ ప్రకారం పనుల వేగం పెంచాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించింది. అనంతరం సెంట్రల్ సాయిల్, మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించింది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురామ్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి, పర్యవేక్షక ఇంజినీర్ రామచంద్రరావు, సీఎస్ఎంఆర్ఎస్ నుంచి హరేంద్ర ప్రకాశ్, దీపముద్ర నాయక్, శాస్త్రవేత్త గౌరవ్పాండే ఉన్నారు. జలవనరుల శాఖ డీఈలు శివప్రసాద్, మల్లికార్జున, ఈఈలు బాలకృష్ణ, దామోదర్, శ్రీనివాస్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్-ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ జీఎం గంగాధర్ , డిప్యూటీ జీఎం మురళి, నాణ్యత నియంత్రణ విభాగం డీజీఎం శంకరయ్య పురోగతిని వివరించారు.





