
యథేచ్ఛగా అటవీ, పశువుల బీడు ఆక్రమణ ఫిర్యాదులు అందుతున్నా పట్టని యంత్రాంగం లింగసముద్రం: పశువుల మేత బీడులో జామాయిల్‌ సాగు న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం, లింగసముద్రం: పశువుల బీడు, అటవీ భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి కొన్ని, అడ్డగోలుగా మరికొన్ని కబ్జా చేసి దర్జాగా చదును చేస్తున్నారు. కొందరు అధికారులు సైతం వీరికి లోపాయికారీగా సహకరిస్తుండడంతో మరింత బరితెగిస్తున్నారు. కందుకూరు డివిజన్‌లో ఈ భూబాగోతం ఎక్కువగా సాగుతోంది. పొన్నలూరు మండలం చెరుకూరు రెవెన్యూ తిమ్మపాలెంలో దాదాపు 250 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుని కొందరు జామాయిల్, పొగాకు సాగు చేస్తున్నారు. ఈ అటవీ భూములను పరిరక్షించాలని ఓ వ్యక్తి లోకాయుక్తను ఆశ్రయించగా... సర్వే చేసి సంరక్షించాలని నాలుగు నెలల క్రితం రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అయినప్పటికీ ఒక్క ఎకరమూ స్వాధీనం చేసుకోలేదు. ఈ విషయమై కందుకూరు సబ్‌ కలెక్టర్‌ డి.హిమవంశీ మాట్లాడుతూ... సంబంధిత అధికారులతో కలిసి ఇటీవలే ఆ భూములను పరిశీలించామన్నారు. నివేదిక వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లింగసముద్రం మండలంలో పశువుల మేత భూముల వివరాలు పరిశీలించి... ఆక్రమణలుంటే తొలగించాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.