
రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల ఆదరణ 50 సంవత్సరాల క్రితం కాణిపాకం ఆలయం కాణిపాకం, న్యూస్‌టుడే: ఒకప్పుడు కేవలం ఓ గ్రామానికి చెందిన చిన్న దేవాలయం. ప్రస్తుతం దేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా ఒకప్పుడు పదుల సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకునేవారు. నేడు లక్షల సంఖ్యలో భక్తులు కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకొని తరిస్తున్నారు. మండల వ్యవస్థలు లేని సమయంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం సమితి పరిధిలోని కాణిపాకంలో ఓ చిన్న ఆలయంగా ఉండేది. స్వామివారి ప్రాశస్త్యం, మహిమ కారణంగా నేడు పుణ్యక్షేత్రంగా రూపాంతరం చెందింది. దర్శనార్థం దేశ, విదేశాల నుంచి రోజుకు 15 నుంచి 20 వేల మంది భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రాక 20 ఏళ్లుగా పెరగడంతో పాత ఆలయానికి మార్పులు చేశారు. దాతలు అందించిన రూ.10 కోట్లతో పాత ఆలయాన్ని పూర్తిగా తొలగించి నూతన నిర్మాణం చేపట్టారు. 50 ఏళ్ల క్రితం స్వామివారి ఆలయం చిన్నదిగా ఉండేది. అప్పట్లో ఆలయాన్ని ఉదయం తెరచి మధ్యాహ్నం 12 గంటలకు మూసేవారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు తెరచి రాత్రి 8 గంటల వరకు సేవలు అందించేవారు. స్వామివారి ఆలయ మహత్యంతో దినదినాభివృద్ధి చెందుతూ మహాక్షేత్రంగా మారింది. ప్రస్తుతం ఉదయం 4.30 గంటలకు తెరచి రాత్రి 9 గంటల వరకు నిరంతరం ఆలయంలో పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు, గణపతి హోమాలు, కల్యాణోత్సవాలు చేపడుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





