
Petrol Price: పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ బిగ్ రిలీఫ్ ఇచ్చే ప్రకటన చేశారు. పెట్రోల్ కొనుగోలుపై ప్రజలకు లీటరుకు రూ.100 సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు. దీని కింద కేవలం సామాన్య ప్రజలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ప్రకటన చేశారు. పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే లీటరుకు రూ.370కి చేరుకున్న విషయం తెలిసిందే.