
విశాఖలోని సెంట్రల్ పార్కు వద్ద కరెన్సీ నోట్ల కలకలం రేగింది. పార్కు ఎదురుగా పెద్ద మొత్తంలో చినిగిపోయిన కరెన్సీ నోట్లు కుప్పగా పడి ఉండటాన్ని వాకర్స్ గుర్తించారు. అందులో రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 కరెన్సీ నోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే చోట ఇంత మొత్తంలో చినిగిన నోట్లు ఎవరు పడేశారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాకర్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వీటిని ఎవరు.. ఎందుకు ఇలా వదిలేశారు అనే కోణాల్లో విచారిస్తున్నారు.




