
బడ్జెట్లో 5G ఫోన్ కొనాలనుకునే వారికి Lava మరో ఆసక్తికరమైన ఎంపికను సిద్ధం చేస్తోంది. Bold N4 Pro 5G పేరుతో రాబోతున్న ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. బ్యాటరీ సామర్థ్యం, కెమెరా విషయంలో ఆకట్టుకునే వివరాలను బయటపెట్టింది. ధర, ప్రాసెసర్ వంటి కీలక అంశాలు మాత్రం లాంచ్కు ముందు వెల్లడించే అవకాశం ఉంది.