
తెలంగాణలో అత్యవసర చికిత్స కోసం గ్రామాలు, చిన్న పట్టణాల నుంచి హైదరాబాద్కు రోగులను తరలించే కుటుంబాలకు అంబులెన్స్ ఛార్జీలు ఆర్థిక భారంగా మారుతున్నాయి. కొన్నేళ్ల క్రితం రూ.1000–2,500గా ఉన్న ఛార్జీలు ప్రస్తుతం రూ.5 వేలు దాటుతున్నాయని బాధితులు చెబుతున్నారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్కు రూ.10 వేల వరకు, కొన్ని అత్యవసర ప్రయాణాలకు రూ.15 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు కుటుంబాలు వెల్లడించాయి. రోగి పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు బేరసారాలకు అవకాశం లేకపోవడంతో అడిగిన మొత్తాన్నే చెల్లించాల్సి వస్తోంది. అంబులెన్స్ ఛార్జీలపై నియంత్రణ అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.