
ఎండుతున్న కుంటలు, చెరువులు నీటి కోసం వచ్చి మృత్యువాత కుక్కల దాడిలో మృతి చెందిన చుక్కల దుప్పి కళేబరాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది ఆత్మకూరు, న్యూస్‌టుడే : ఎల్‌నినో ప్రభావం.. అడవి జంతువులపైనా పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అడవిలోని నీటి కుంటలు, చెరువులు ఎండుతున్నాయి. చివరికి తాగునీటి కోసం జంతువులు గ్రామాల వైపు వచ్చి ప్రమాదాలబారిన పడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో 2,172.57 చ.కి.మీ. మేర నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ప్రస్తుతం ఎల్‌నినో నేపథ్యంలో అడవిలోని చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. వన్యప్రాణులు తిరిగే ప్రాంతాల్లో వాటి దాహార్తి తీర్చేందుకు సాసర్‌పిట్‌లు ఏర్పాటు చేశారు. నల్లమలలో వన్యప్రాణుల నీటి అవసరాలు తీర్చేందుకు అటవీ శాఖ ఏటా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు వెచ్చిస్తోంది. ఈ నిధులతో సాసర్‌ పిట్‌లలో నీరు నింపడం, చెక్‌డ్యాంల ఏర్పాటు, మరమ్మతులకు ఖర్చు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో చుక్కనీరు లేకపోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతానికి అడవిలో నీటి సమస్య లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నీటి సమస్య రాకుండా సాసర్‌పిట్లను నీటితో నింపాలని 15 రోజుల కిందట సిబ్బందిని ఆదేశించాం. సాధారణంగా వేసవిలో చెరువులు, కుంటల్లో నీరు తగ్గిపోతుంది. ఈ ఏడాది వర్షాకాలంలోనూ నీటి సమస్యలు ఏర్పడనున్నాయి. అవసరమైనచోట ఆటోమేటిక్‌గా నీరు పడేలా సోలర్‌ పరికరాలు ఏర్పాటు చేశాం. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు అందరూ సహకరించాలి. విఘ్నేష్‌అపావ్‌, డిప్యూటీ డైరెక్టర్‌, ఆత్మకూరు అటవీ డివిజన్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.