
ఇంటర్నెట్‌ డెస్క్‌: తల్లి కాబోతున్న ఆనందంలో ఉన్నారు స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ). గర్భధారణ సమయంలో తాను ఇష్టంగా తీసుకుంటున్న ఆహార పదార్థాల గురించి తాజాగా అభిమానులతో ఆమె పంచుకున్నారు. తనకు దక్షిణాది సంప్రదాయ వంటకాలంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు. సోనీ విళ (Sony Vizha) పంచుకున్న ఓ పోస్ట్‌లో.. జీవితాంతం ఒకే రకమైన ఆహారం తినాల్సి వస్తే ఏం ఎంచుకుంటారు? అని సమంతను అడగ్గా, ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, మధ్యాహ్నం భోజనంలో పెరుగన్నం, రాత్రికి దోశ తినేందుకు ఇష్టపడతానని ఆమె బదులిచ్చారు. ‘‘ప్రస్తుతం గర్భంతో ఉన్నందున నాకెక్కువగా ఇవే తినాలనిపిస్తోంది. భవిష్యత్తులో నా ఇష్టాలు మారొచ్చు’’ అని ఆమె సరదాగా చెప్పుకొచ్చారు. ఇక, సమంత గతేడాది దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరును కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీమంతం వేడుక కూడా సంప్రదాయబద్ధంగా జరిగింది. కాగా, గత జూన్‌లో.. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ మీట్‌లో తాను తల్లి కాబోతున్న విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించారు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాక సినిమాల నుంచి చిన్న విరామం తీసుకోనున్నట్లు ఆమె అప్పట్లోనే వెల్లడించారు. ప్రస్తుతం సమంత ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళం’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. రాజ్ & డీకే తెరకెక్కించే భవిష్యత్ ప్రాజెక్టుల్లోనూ ఆమె భాగం కానున్నట్లు తెలుస్తోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఇంటర్నెట్‌ డెస్క్: ఇండస్ట్రీలో క్యూట్‌ కపుల్‌ అనగానే గుర్తొచ్చేది సూర్య (Suriya)- జ్యోతిక జోడీనే. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఘనంగా వేడుక చేసుకున్నారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆస్మాన్’.