
కేకే ఎక్స్‌ప్రెస్‌లో ఘటన ధర్మవరం, న్యూస్‌టుడే: రైలులో మత్తు ఇచ్చి నేవీ కానిస్టేబుల్‌ దంపతుల నుంచి ఓ మహిళ నాలుగున్నర తులాల బంగారు గొలుసు కొట్టేసింది. మంగళవారం రాత్రి దిల్లీ నుంచి బెంగళూరు వెళ్తోన్న కేకే ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన గోవిందు నేవీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మహారాష్ట్రలోని కోపర్‌గావ్‌ నుంచి భార్య సంధ్యతో కలసి స్వగ్రామానికి వచ్చేందుకు మంత్రాలయానికి టికెట్ తీసుకున్నాడు. రిజర్వేషన్‌ సీˆట్లు లభించక జనరల్‌ బోగీలో ప్రయాణిస్తున్నారు. వీరు మంత్రాలయంలో దిగాల్సి ఉంది. బోగీలో 50 ఏళ్లకు పైబడిన ఓ మహిళ గోవిందు దంపతులతో మాటలు కలిపింది. తన కుమారుడు ఆర్మీలో పని చేస్తున్నాడని నమ్మబలికింది. దేవుడి ప్రసాదం అంటూ ఆ మహిళ వారికి ఇవ్వడంతో వారు తీసుకొని తిన్నారు. తిన్న వెంటనే మత్తులోకి జారుకున్నారు. బుధవారం రైలు ధర్మవరం స్టేషన్‌కు చేరుకోగానే మత్తు ప్రభావంలో ఉన్న గోవిందుకు మెలకువ రావడంతో రైలులో నుంచి భార్య సంధ్యతో కలసి దిగాడు. నడవలేని స్థితిలో ప్లాట్ఫామ్‌ దిమ్మెపై కూర్చుండిపోయారు. నాలుగున్నర తులాల గొలుసు అపహరణ విషయం తెలిసి ప్రసాదం ఇచ్చిన మహిళపై ధర్మవరం జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చికిత్స నిమిత్తం గోవిందు, సంధ్యను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.