
డిచ్‌పల్లి: ఉమ్మడి జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు, ప్రమాదాల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన యువ ఆపద మిత్ర స్కీం (వైఏఎంఎస్)ను బుధవారం కమాండెంట్ సీతారాం ప్రారంభించారు. డిచ్‌పల్లిలోని ఏడో పోలీస్ బెటాలియన్‌ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఎన్ఎస్ఎస్, నెహ్రు యువకేంద్రం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చురుకుగా ఉండి, ఆసక్తి ఉన్న 66 అభ్యర్థులను ఈ స్కీమ్‌ కోసం ఎంపిక చేశామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అత్యవసర పరిస్థితులో ప్రాణాలు కాపాడానికి బెటాలియన్ టీమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. యువ ఆపద మిత్ర బృందం సభ్యులు తక్కువ సమయంలోనే ఘటన స్థలం చేరుకుని ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడే విధంగా వారం రోజల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా 66 మందికి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కమాండెంట్ నర్సింహులు, ఏసీఆర్ఎఫ్ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, తెలంగాణ వర్సిటీ ఆచార్య అపర్ణ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





