
హుస్నాబాద్ గ్రామీణం: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో కురిసిన భారీ వర్షానికి కోనేటి వాగు ఉప్పొంగింది. ఈ వాగు వరద ఉధృతికి తోటపల్లి, జనగామ గ్రామాల మధ్య ఉన్న లింకు రోడ్డు కోతకు గురై కొట్టుకుపోయింది. దీంతో పరిసర రైతులు తమ గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేయించాలని రైతులు కోరుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




