
LPG Cylinder Price Hike : పండుగల సీజన్లో గ్యాస్ వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరలతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాటరింగ్ వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా విజయవాడలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3 వేల మార్క్‌ను దాటేసింది. ఇప్పటికే పండుగ ఖర్చులతో సతమతమవుతున్న వేళ.. ఈ పెంపుతో స్వీట్లు, టిఫిన్లు, హోటల్ ఆహార ధరలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో వినియోగదారుల్లోనూ ఆందోళన మొదలైంది. Also Read :