
సర్కారుకు రైస్ మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలివి.. బీఆర్‌ఎస్ హయాం నుంచి ఉన్నవి 4,939 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనివి 1,692 కోట్లు బకాయిల జాబితాలో రాష్ట్రంలోని 2,388 మిల్లులు బియ్యం ఇవ్వరు.. డబ్బులు చెల్లించరు పన్నెండేళ్లుగా ఇదే తీరు.. కేసులు పెట్టినా, జైలుకు పంపినా, ఆస్తులు జప్తుచేసినా.. జాన్తానై ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లే అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వైనం ఉక్కుపాదం మోపాలని సర్కారు నిర్ణయం హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించడం, రైస్‌మిల్లర్లు వాటిని మర ఆడించి బియ్యం ఇవ్వకుండా.. తమకిచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లే అమ్ముకోవడం రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిపోయింది. ఏ సీజన్‌లో ఇచ్చిన ధాన్యానికి సంబంధించి అదే సీజన్‌లో బియ్యాన్ని వసూలు చేయడంలో ప్రభుత్వాలు, పౌరసరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. రైస్‌మిల్లర్ల అక్రమ దందాకు ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు సహకరిస్తున్నారు. దీంతో మిల్లర్లు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పుష్కర కాలం (12 ఏళ్ల) నుంచి మొండి బకాయిలు పేరుకుపోయాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ప్రభుత్వానికి అప్పజెప్పకుండా, మింగిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండా రైస్‌మిల్లర్లు దొంగాట ఆడుతున్నారు. కేసులు నమోదు చేసినా, జైలుకు పంపినా, ఆస్తులు జప్తు చేసినా.. జాన్తా నై అంటూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లర్ల పాత బకాయిలు రూ.6,631 కోట్లు ఉండగా.. వీటిని చెల్లించడానికి మొండికేస్తున్నారు. వాస్తవానికి రైస్‌మిల్లర్ల దందా ఈనాటిది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కొంత మేరకు జరిగినా.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హద్దులు మీరిపోయారు. 2014-15 సీజన్ నుంచి మొదలుకొని ఇప్పటివరకు అక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. రైతుల నుంచి ధాన్యా న్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొని.. రైస్‌మిల్లులకు కేటాయిస్తుంది. మిల్లర్లు వాటిని బియ్యంగా మార్చేందుకు కేవలం జాబ్‌వర్క్ (అద్దెపని) మాత్ర మే చేయాలి. ఇందుకుగాను ప్రభుత్వం




























.webp)
















