
మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌ కర్నూలు విద్య, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ చెప్పారు. నగరంలోని సెయింట్ జోసెఫ్‌ డిగ్రీ కళాశాలలో బుధవారం మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓర్వకల్లుకు భారీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. సెమీ కండక్టర్, ఫుడ్‌ పార్క్‌ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం లభించిందన్నారు. పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. దీంతో రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఓర్వకల్లు ప్రాంతానికి సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కల్పనాధికారిణి దీప్తి, కళాశాల డీన్‌ శౌరిల్‌ పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




