
లే నాన్న. అమ్మను లేపితే లేవడం లేదు. టైర్ల కింద పడి ఉంది నాన్న. నువ్వు లెగు నాన్న.. వెళ్లి అమ్మను లేపుదాం అంటూ ఏడేళ్ల చిన్నారి.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

లే నాన్న. అమ్మను లేపితే లేవడం లేదు. టైర్ల కింద పడి ఉంది నాన్న. నువ్వు లెగు నాన్న.. వెళ్లి అమ్మను లేపుదాం అంటూ ఏడేళ్ల చిన్నారి.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బూడిద ట్యాంకర్‌ మహిళ దుర్మరణం తండ్రి మోహన్‌ ముఖంపై నీళ్లు చల్లుతూ లేపుతున్న కుమార్తె జైత్ర లే నాన్న. అమ్మను లేపితే లేవడం లేదు. టైర్ల కింద పడి ఉంది నాన్న. నువ్వు లెగు నాన్న.. వెళ్లి అమ్మను లేపుదాం అంటూ ఏడేళ్ల చిన్నారి అపస్మారక స్థితిలో ఉన్న తన తండ్రి మొహంపై నీళ్లు చల్లుతూ అమాయకంగా మాట్లాడిన మాటలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. ఆదివారం కావడంతో వసతిగృహంలో చదువుతున్న తమ పెద్ద కూతురును చూసేందుకు బయలుదేరిన ఓ చిన్న కుటుంబాన్ని బూడిద ట్యాంకర్‌ బుగ్గి చేసింది. టేకులపల్లి ఎస్సై తిరుపతి తెలిపిన ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెం పంచాయతీ కొమ్ముగూడెంకు చెందిన గుగులోత్‌ మోహన్, ఉమా (32) భార్యాభర్తలు. వీరికి పెద్ద కుమార్తె పూజితశ్రీ, చిన్న కుమార్తె జైత్ర ఉన్నారు. మోహన్‌ వ్యవసాయం చేస్తుంటాడు. కాగా కొత్తగూడెం గురుకులంలో చదువుతున్న పెద్ద కుమార్తె పూజితశ్రీని చూసేందుకు ఆదివారం ఉదయం మోహన్, ఉమా, వారి చిన్న కుమార్తె జైత్రతో కలిసి ద్విచక్రవాహనంపై కొత్తగూడెం బయలుదేరారు. వీరి ద్విచక్రవాహనం మండల పరిధిలోని సాయన్నపేట మూలమలుపు వద్దకు రాగానే వారి వెనుకాల నుంచి వచ్చిన బూడిద ట్యాంకర్‌ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో ఉమా వెనుక టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. మోహన్, జైత్రలు దూరంగా పడటంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో అపస్మారక స్థితిలో పడి ఉన్న మోహన్‌ దగ్గరకు వెళ్లిన కుమార్తె జైత్ర నీళ్లు చల్లుతూ తండ్రిని లేపుతున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. మృతురాలి అత్తమ్మ మారిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. టేకులపల్లి, న్యూస్‌టుడే .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి





