
అశ్వారావుపేట గ్రామీణం: మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నారాయణపురం - గాండ్లగూడెం మధ్య జగన్నాథపురం సమీపంలో ఉన్న పెద్దవాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి వెళ్లి నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను సీజ్ చేసి అశ్వారావుపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





