
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 2029 నాటికి అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ‘హౌసింగ్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని స్పష్టం చేశారు.




