
Jio canva offer: ప్రముఖ విజువల్ డిజైన్ ప్లాట్ఫామ్ కాన్వాతో (Canva) రిలయన్స్ జియో (Jio) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద జియో వినియోగదారులు, ఏడాది పాటు ఉచితంగా కాన్వా ప్రీమియం వెర్షన్ వినియోగించుకోవచ్చు.
Jio canva offer | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విజువల్‌ డిజైన్‌ ప్లాట్‌ఫామ్‌ కాన్వాతో (Canva) రిలయన్స్‌ జియో ( Jio ) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద జియో వినియోగదారులు, ఏడాది పాటు ఉచితంగా కాన్వా ప్రీమియం వెర్షన్‌ వినియోగించుకోవచ్చు. అర్హులైన జియో వినియోగదారులు కాన్వా ప్రో లేదా కాన్వా ప్రో లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఎటువంటి రుసుము లేకుండా పొందొచ్చు. మైజియో యాప్‌ ద్వారా ఈ ఆఫర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.349, రూ.399 ప్రీపెయిడ్‌ ప్లాన్లతో కాన్వా ప్రో లైట్‌, కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ఈ రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్లతో పాటు రూ.349 కంటే ఎక్కువ విలువ కలిగిన 2జీబీ హైస్పీడ్ డేటా కలిగిన అన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్లపైనా కాన్వా ప్రో లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందిస్తున్నట్లు జియో తెలిపింది. మైజియో యాప్‌ ద్వారా ఆఫర్‌ను యాక్టివేట్‌ చేసుకున్నాక ప్రో, ప్రో లైట్‌ ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు. కాన్వాప్రో లైట్‌ ద్వారా 50 జీబీ, కాన్వా ప్రోలో 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజీ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 16 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇక రూ.399 రీఛార్జిపై 28 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 70 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు వినియోగించుకోవచ్చు. జియో హాట్‌స్టార్‌ మొబైల్‌, జియో ఏఐక్లౌడ్‌ వంటి సదుపాయాలు లభిస్తాయి. రూ.349 ప్లాన్‌పై రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 56 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లు, జియో హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌, జియోఏఐ క్లౌడ్‌ సదుపాయాలు పొందొచ్చు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



