

- రూ. 1000 లోపు ధరలో జియో ఓటీటీ ప్లాన్లు ఇవే
- జియోలో మొత్తం 3 ప్లాన్లు ఉన్నాయి
- రూ. 200 ప్లాన్‌లో అదనపు డేటా, OTT బెనిఫిట్స్
- రూ. 500, రూ. 550 ప్లాన్లతో మరింత డేటా
Jio Recharge Plans : జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఓటీటీ బెనిఫిట్స్ అందించే మంచి ప్లాన్ల కోసం చూస్తున్నారా? జియో ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితంగా పొందొచ్చు తెలుసా? అది ఎలాగంటారా? మీరు జియో యూజర్ అయితే ఇది సాధ్యమే.. ఈ టెలికాం దిగ్గజం ఫ్రీ అమెజాన్ ప్రైమ్‌తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే రూ. 1,000 లోపు బెస్ట్ జియో ప్లాన్లను ఇప్పుడు తెలుసుకుందాం..
జియో రూ. 200 ప్రీపెయిడ్ ప్లాన్ :
OTT ఎంటర్టైన్మెంట్, అదనపు డేటాను కోరుకునే కస్టమర్లకు జియో రూ. 200 ప్రీపెయిడ్ ప్లాన్ అత్యంత సరసమైన ప్లాన్. 28 రోజుల వ్యాలిడిటీతో (Jio Recharge Plans) వస్తుంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. అంతేకాదు.. అర్హులైన కస్టమర్లకు 30GB ఫిక్స్డ్ 4G/5G డేటా, అన్ లిమిటెడ్ 5జీ డేటా కూడా అందిస్తుంది. 30GB కోటా తర్వాత డేటా స్పీడ్, 64Kbpsకి తగ్గుతుంది.ఈ రీఛార్జ్ కేవలం డేటాకు మాత్రమే. ఇందులో వాయిస్ కాలింగ్, SMS బెనిఫిట్స్ లేవు. యాక్టివ్ బేస్ ప్లాన్ తప్పినిసరి. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే.. సబ్స్క్రైబర్లు జియోటీవీ ద్వారా యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్, జియోహాట్‌స్టార్ మొబైల్, అనేక ఇతర ఓటీటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్లాన్‌లో 1,000 కన్నా ఎక్కువ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ పొందొచ్చు.
జియో రూ. 500 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఆల్-ఇన్-వన్ రీఛార్జ్ కోరుకునే కస్టమర్ల కోసం జియో రూ. 500 ప్రీపెయిడ్ ప్లాన్, రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, అనేక రకాల ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది. అర్హత గల కస్టమర్లు అన్లిమిటెడ్ 5జీ డేటాను కూడా పొందొచ్చు.
- జియోలో మొత్తం 3 ప్లాన్లు ఉన్నాయి





