

- విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు
- ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో మరింత తగ్గుతుంది
- భారీ డిస్ప్లే, పవర్ఫుల్ చిప్, అడ్వాన్స్ కెమెరా సెటప్
Apple iPhone 17 Pro Max : ఆపిల్ అభిమానులకు అదిరిపోయే వార్త.. నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్లు రాబోతున్నాయి. ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ 18 ప్రోలను సెప్టెంబర్ 9న జరిగే సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్లో ఆవిష్కరించనుంది.
ఈ కొత్త ఐఫోన్ మోడల్స్ అధికారిక లాంచ్ ముందే ప్రస్తుత జనరేషన్ ఫ్లాగ్షిప్ మోడల్ ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర భారీగా తగ్గింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్సైట్లో రూ. 5వేలకుపైగా భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఈ ఐఫోన్ ధర ఇంకా తగ్గుతుంది. కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ డీల్ పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర తగ్గింపు :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ సమయంలో ధర రూ. 1,49,900గా ఉండేది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్సైట్లో ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 5,910 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా రూ. 143,990కి లిస్టు అయింది. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 4వేలు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ 6 నెలల్లో నెలకు కేవలం రూ. 23,331 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. - ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో మరింత తగ్గుతుంది





