
ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలో బంగారం దిగుమతులు తగ్గుముఖం పట్టాయి (gold imports). ఆగస్టులో 2.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.22,049 కోట్లు) పసిడి దిగుమతి అయింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన 5.4 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 57.7 శాతం తగ్గింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను వెలువరించింది. బంగారం ధరలు పెరగడం, పసిడి కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపే ఇందుకు కారణమని వాణిజ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. పసిడి కొనుగోళ్లు తగ్గినా.. ఆభరణాల ఎగుమతులు (Gold exports) 26.1 శాతం పెరిగి 43.81 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఎగుమతులు ఊపందుకోవడంతో దేశ వాణిజ్య లోటు 26.9 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. జులైలో 31.98 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మొత్తంగా దేశీయ దిగుమతులు 14.1 శాతం పెరిగి 70.67 బిలియన్‌ డాలర్లకు (రూ.6.77 లక్షల కోట్లు) చేరినట్లు ప్రభుత్వ నివేదిక పేర్కొంది. అయితే, అదే స్థాయిలో ఎగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు తగ్గింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిక్స్‌ దేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇంజినీరింగ్‌, పెట్రోలియం, కెమికల్స్‌ ఉత్పత్తుల ఎగుమతులు కూడా భారతీయ ఆర్థిక వ్యవస్థకు కలిసొచ్చే అంశంగా చెప్పారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





