
వైకాపా హయాంలో యూనిట్‌ సగటున రూ.7.78కి కొనుగోలు కూటమి ప్రభుత్వంలో రూ.5.15కే యూనిట్‌ ఈనాడు, అమరావతి: విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని సాధ్యమైనంత మేరకు నియంత్రించడంపై విద్యుత్‌ సంస్థలు దృష్టిపెట్టాయి. దీనికోసం నాలుగు విధానాలను విద్యుత్‌ సంస్థలు అమలుచేశాయి. వైకాపా హయాంలో నెలకు సగటున రూ.641.5 కోట్లు విద్యుత్‌ కొనుగోలు కోసం ఖర్చుచేసింది. యూనిట్‌ విద్యుత్‌ సగటున రూ.7.78 చొప్పున కొనుగోలు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ కొనుగోళ్లను నియంత్రించడం ద్వారా కొనుగోలు వ్యయం నెలకు సగటున రూ.194 కోట్లకు తగ్గింది. యూనిట్‌ కొనుగోలుకు రూ.5.15 చొప్పున వెచ్చించింది. దీనివల్ల విద్యుత్‌ కొనుగోలు వ్యయంలో యూనిట్‌కు రూ.2.63 చొప్పున ఆదా సాధ్యమైంది. వైకాపా ప్రభుత్వంలో 2022 ఏప్రిల్‌ నుంచి 2024 జూన్‌ మధ్య (27 నెలల్లో) 22,251 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌.. యూనిట్‌కు సగటున రూ.7.78 చొప్పున డిస్కంలు కొన్నాయి. ఈ ప్రకారం విద్యుత్‌ కొనుగోలుకు నెలకు సగటున రూ.641.5 కోట్ల చొప్పున.. 27 నెలల్లో రూ.17,320.5 కోట్లు డిస్కంలు ఖర్చుచేశాయి. మొత్తం విద్యుత్‌లో.. యూనిట్‌ సగటున రూ.7.50 చొప్పున 71.9% విద్యుత్‌ను ఎక్స్ఛేంజీల ద్వారా కొన్నాయి. బైలేటరల్‌ విధానంలో 28.1% విద్యుత్‌ యూనిట్‌కు సగటున రూ.8.51 చొప్పున కొన్నాయి. సంస్కరణలతో.. నెలకు సగటున రూ.194 కోట్లకు తగ్గింపు వి ద్యుత్‌ కొనుగోలు విధానంలో 2024 జులై నుంచి 2026 ఆగస్టు మధ్య చేసిన మార్పులతో విద్యుత్‌ కొనుగోళ్లు తగ్గాయి. ఆ మేరకు కొనుగోలు వ్యయం తగ్గింది. 26 నెలల్లో 9,790 ఎంయూలే డిస్కంలు కొన్నాయి. సంస్కరణల అమలుతో యూనిట్‌ సగటున రూ.5.15కు తగ్గింది. నెలకు రూ.194 కోట్ల చొప్పున.. రూ.5,044 కోట్లు మాత్రమే విద్యుత్‌ కొనుగోలుకు డిస్కంలు ఖర్చుచేశాయి. మొత్తం కొన్న విద్యుత్‌లోనూ 0.3% మాత్రమే బైలేటరల్‌ విధానంలో డిస్కంలు తీసుకున్నాయి. ఉదయం 5-8, రాత్రి 7-11 గంటల మధ్య బ్యాంకింగ్‌ విధానంలో విద్యుత్‌ తీసుకున్నాయి. దీనివల్ల పీక్‌ డిమాండ్‌ సమయంలో తక్కువ ధరకే విద్యుత్‌ అందుబాటులో ఉంది. రియల్‌టైం మార్కెట్‌లో 92.5% విద్యుత్‌ తక్కువ ధరకు డిస్కంలు కొన్నాయి. ఎంబీఈడీ విధానంలో నెలకు సగటున రూ.31.87 కోట్ల ఆదా మా ర్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్‌ ఉన్నప్పుడు మార్కెట్‌ బేస్డ్‌ ఎకనమిక్‌ డిస్పాచ్‌(ఎంబీఈడీ) విధానంలో (మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్‌ దొరికేటప్పుడు జెన్‌కో థర్మల్‌ స్టేషన్లను బ్యాక్‌డౌన్‌ చేయడం) విద్యుత్‌ను డిస్కంలు కొన్నాయి. ఆ సమయంలో అధిక ధర ఉన్న జెన్‌కో, ఇతర థర్మల్‌ విద్యుత్‌ప్లాంట్లను బ్యాక్‌డౌన్‌ చేసి, మార్కెట్‌లో చౌకవిద్యుత్‌ను కొన్నాయి. దీంతో నెలకు సగటున రూ.31.87 కోట్ల చొప్పున.. 8 నెలల్లో రూ.255 కోట్లు ఆదా అయింది. దీంతోపాటు నిర్దేశిత వ్యవధిలో ఉత్పత్తి సంస్థలకు చెల్లింపుల ద్వారా మరో రూ.100 కోట్లను విద్యుత్‌ సంస్థలు ఆదా చేశాయి. విద్యుత్‌ కొనుగోళ్ల ఆప్టిమైజేషన్‌ కోసం.. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





