
ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం సాధించే అవకాశమొచ్చింది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏటా నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పరీక్ష ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపే ప్రతిభతో నియామకాలుంటాయి. ఎంపికైన పోస్టు ప్రకారం లోయర్‌ డివిజన్‌ క్లర్కు (ఎల్‌డీసీ)/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఏ)/ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈవో) హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. ఆకర్షణీయ వేతనంతో పాటు మేటి భవిష్యత్తునూ సొంతం చేసుకోవచ్చు. ఎ స్‌ఎస్‌సీ-సీహెచ్‌ఎస్‌ఎల్‌లో అవకాశం వచ్చినవారు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 2,536 పోస్టులు భర్తీ చేయనున్నారు. నియామకాల సమయానికి ఈ సంఖ్య పెరగొచ్చు. శాఖలు/ విభాగాల వారీ ఖాళీల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలు, స్కిల్‌/ టైప్‌ టెస్టులతో నియామకాలు ఉంటాయి. లోయర్‌ డివిజన్‌ క్లర్కు (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఏ) ఉద్యోగాలకు లెవెల్‌-2 మూలవేతనం రూ.19,900 అందుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు లెవెల్‌-4 మూలవేతనం రూ.25,500 దక్కుతుంది. కొన్ని విభాగాలకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకైతే లెవెల్‌-5 మూలవేతనం రూ.29,200 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. లెవెల్‌-2 ఉద్యోగాలకు సుమారు రూ.40,000, లెవెల్‌-4కు ఇంచుమించు రూ.50,000, లెవెల్‌-5 కొలువైతే రూ.60,000 వేతనం అందుతుంది. ఆన్‌లైన్‌లో 200 మార్కులకు నిర్వహిస్తారు. వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. వ్యవధి గంట. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. తప్పు జవాబుకు అర మార్కు తగ్గిస్తారు. పరీక్షలో 4 భాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (బేసిక్‌ నాలెడ్జ్‌) 25 ప్రశ్నలు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 25, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (బేసిక్‌ అరిథ్‌మెటిక్‌ స్కిల్స్‌) 25, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 4 సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-1: 180 మార్కులకు ఉంటుంది. మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ ఒక్కో విభాగం నుంచి 30 చొప్పున మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ 3 మార్కులు. పరీక్ష వ్యవధి ఒక గంట. సెక్షన్‌-2: దీన్నీ 180 మార్కులకే నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 40, జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ 3 మార్కులు. పరీక్ష వ్యవధి ఒక గంట. సెక్షన్‌-3: కంప్యూటర్‌ పరిజ్ఞానంపై 45 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 15 నిమిషాలు. ప్రతి ప్రశ్నకూ 3 మార్కులు. ఈ మూడు సెక్షన్లలో ప్రతి తప్పు జవాబుకూ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. సెక్షన్‌-4: ఇందులో డేటా ఎంట్రీ పోస్టులకు 15 నిమిషాల వ్యవధిలో స్కిల్‌ టెస్టు ఉంటుంది. ఎల్‌డీసీ/ జేఎస్‌ఏ పోస్టులకు 10 నిమిషాల వ్యవధిలో టైప్‌ టెస్టు నిర్వహిస్తారు. టైర్‌-1 లో అర్హత సాధిస్తేనే టైర్‌-2కి అనుమతిస్తారు. ఈ రెండు దశల్లోనూ అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులు 30, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ 25, మిగతా విభాగాల వారు 20 శాతం చొప్పున ప్రతి సెక్షన్‌లోనూ మార్కులు సాధించడం తప్పనిసరి. కంప్యూటర్‌ పరిజ్ఞానం, స్కిల్‌/ టైప్‌ టెస్టులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులను ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. తుది నియామకాలు టైర్‌-2 మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. పోస్టులు: 2,536. అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా సమాన స్థాయి కోర్సు పూర్తిచేయాలి. నేషనల్‌/ స్టేట్‌ ఓపెన్‌ స్కూల్‌ విధానంలో పూర్తి చేసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆహారం, ప్రజా పంపిణీ విభాగం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల్లోని డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా సైన్స్‌ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసినవారే అర్హులు. వయసు: 01.08.2026 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 02.08.1999 - 01.08.2008 మధ్య జన్మించినవారు అర్హులు. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; దివ్యాంగులకు 10-15 ఏళ్లు సడలింపులు వర్తిస్తాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబరు 07వ తేదీ రాత్రి 11 గంటల వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ఉండదు. పరీక్ష తేదీలు: ఈ వివరాలు తర్వాత ప్రకటిస్తారు. వెబ్‌సైట్‌: https://ssc.gov.in/ ‘‘టైర్‌-1లో 60 నిమిషాల్లో 100 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. అంటే ఒక్కో ప్రశ్నకూ 36 సెకన్ల సమయమే ఉంటుంది. అలాగే సెక్షన్ల వారీ సమయ నిబంధనతో పాటు రుణాత్మక మార్కులూ ఉన్నాయి. అందువల్ల పూర్తి కచ్చితత్వంతో, తక్కువ వ్యవధిలో సమాధానం ఇవ్వగలిగే సులువైన ప్రశ్నలకే ముందు జవాబులు గుర్తించాలి’’ .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




