
మోఖి: చైనాలో జరిగిన ఏహెచ్ఎఫ్ జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు అదరగొట్టాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రెండు టీమ్‌లూ.. ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులను చిత్తు చేసి హ్యాట్రిక్ టైటిల్‌తో సత్తాచాటాయి. పురుషుల విభాగంలో భారత్.. 4-1తో సౌత్కొరియాను ఓడించి గోల్డ్ మెడల్ కొట్టింది. భారత్ తరఫున అజీత్ యాదవ్ (9వ నిమిషంలో), కెప్టెన్ అన్మోల్ ఎక్కా (13వ), ప్రభ్‌దీప్ సింగ్ (21వ), అషు మౌర్య (50వ) తలా గోల్ కొట్టి జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. సౌత్‌కొరియా తరఫున నాలుగో క్వార్టర్లో లీ మిన్హ్యోక్ (54వ) ఒక గోల్ చేశాడు. ఈ టోర్నీలో అబ్బాయిలకు ఇది వరుసగా నాలుగో టైటిల్ కాగా మొత్తంగా ఆరో (2004, 2008, 2015, 2023, 2024, 2026)వది కావడం విశేషం. మహిళల కేటగిరీలో భారత్.. 1-0తో ఆతిథ్య చైనాను ఓడించి పసిడి పతకాన్ని సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో సానిక చంద్రకాంత్ మనె 17వ నిమిషంలో గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చింది. తర్వాత భారత్ గోల్ కొట్టకపోయినా ఆరంభం నుంచే పదే పదే గోల్స్ కోసం యత్నించిన చైనాను విజయవంతంగా నిలువరించింది. తాజా విజయాలతో భారత మెన్స్, విమెన్స్ టీమ్స్ వచ్చే ఏడాది జరుగబోయే ఎఫ్ఐహెచ్ జూనియర్ వరల్డ్ కప్‌నకు అర్హత సాధించాయి.





