
లంచం డబ్బుతో ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి కీసర: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం అర్ధరాత్రి వేళ ఏసీబీ సోదాలు సంచలనం రేపాయి. సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ కేసు విషయంలో నిందితుడికి బెయిల్‌ ఇచ్చేందుకు సీఐ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిందితుడితో పనిచేయించుకున్నారు. కొన్ని రోజులు బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌ తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేశారు. ఆ వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మరోవైపు లంచం డబ్బు తీసుకునే బాధ్యతను ఎస్సైకు సీఐ అప్పగించారు. ఈ సమాచారంతో డీఎస్పీ మాజీద్‌ అలీఖాన్‌ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కీసర చెరువుగట్టు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్సై.. రూ. 5 లక్షలు లంచం తీసుకున్నాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు అక్కడికి రావడం చూసిన ఎస్సై అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. కెమికల్‌ టెస్టులు చేయించుకోకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. అనంతరం ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




